తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఇరిగేషన్ ను 2వస్థానంలో నిలబెట్టామని ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి కారుదింపిన తర్వాత ఫ్రస్టేషన్ లో పడ్డారని అన్నారు. 108అంబులెన్సుల్లో 307కోట్లు కొట్టేశారని.. 12సిబిఐ,ఈడి కేసుల్లో 16నెలలు ఊచలు లెక్కపెట్టారని అన్నారు. అలాగే తప్పుడు కేసులకి భయపడేది లేదన్నారు. జైలునుండి బెయిల్ పై వచ్చిన విజయసాయిరెడ్డి ఒళ్ళుసోయిలో పెట్టుకోవాలని.. బెదిరింపులు ఆపాలని దేవినేని ఉమ సూచించారు.