యూపీలో వారానికి రెండు రోజులు లాక్‌డౌన్

Update: 2020-07-12 16:44 GMT

కరోనా కట్టడికి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యలయాలు కేవలం ఐదురోజులు మాత్రమే వాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మిగతా రెండు రోజులు మూతపడి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కార్యాలయాలు మూతవేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూపీ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ ఈ మేరకు ప్రకటించారు. అయితే, ఈ నిబంధనల నుంచి బ్యాంకులు, ఇతర పారిశ్రామిక విభాగాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్మాగారాలు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. నిత్యవసర సరుకుల కోసం రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంటుందని అన్నారు. ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖలు పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, శానిటైజేషన్ నిర్వహిస్తాయని చెప్పారు. ఈ నిబందనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. యూపీలో ప్రస్తుతం 55 గంటల లాక్‌డౌన్ అమలులో ఉంది.

Similar News