రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం

Update: 2020-07-12 18:16 GMT

రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ రోజు రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం నాటికి శాసనసభ్యులందరూ జైపూర్‌లో ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇటీవల డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, తనకు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు వ్యాఖ్యానించారు, అంతేకాదు పార్టీ హైకమాండ్ ను సైతం కలవడానికి ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈరోజు జరిగే సమావేశంలో సచిన్ పైలట్ తో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరో తేలిపోతుందని అందుకే ఎమ్మెల్యేల భేటీకి సీఎం గెహ్లాట్ పిలుపునిచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సమావేశం నేపథ్యంలో రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి, కార్మిక మంత్రి టికరమ్ జల్లీ, ఆరోగ్య మంత్రి రఘు శర్మ గెహ్లోట్ నివాసానికి చేరుకున్నారు.

Similar News