జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల ఏరివేత.. తాజాగా..

Update: 2020-07-12 17:45 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చెలరేగడంతో ఆదివారం ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ప్రాంతంలో ఇంకా కొద్దిమంది ఉగ్రవాదులు దాక్కున్నట్లు భావిస్తున్నందున ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్మీ ఎన్‌కౌంటర్ గురించి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. మరణించిన ఉగ్రవాదిని అధికారులు ఇంకా గుర్తించలేదు. తెల్లవారుజామున సోపోర్‌లోని రెబ్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఉగ్రవాదులు ముందుగా కాల్పులు ప్రారంభించారు. అయితే భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు.

Similar News