గర్భిణిలు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తల్లికి కరోనా లేకున్నా అప్పుడే జన్మించిన శిశివుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ సంఘటన గురువారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణీ మహిళ జూన్ 11న కరోనా భారిన పడి రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే 14 రోజుల చికిత్స అనంతరం జూన్ 25న మరోసారి పరీక్షలు నిర్వహించగా మరోసారి పాజిటివ్ అనే వచ్చింది. అయితే జూలై 7 తారీఖున నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని నిర్ధారణ అయింది.
ఈ క్రమంలో గర్భంతో ఉన్న ఆ మహిళ ఇటీవల ప్రసవించింది. అందండీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు కోవిడ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులంతా ఆశ్చర్యపోయారు. పైగా ఆ శిశువులో వైరస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈ సంఘటనపై రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. తల్లి బొడ్డుతాడు నుంచి శిశువుకు సోకె అవకాశం ఉందని అన్నారు. ఇలా రావడంతో ప్రపంచంలో మొట్టమొదటి సారి అని అంటున్నారు.