గూగుల్ పే ద్వారా పీఎం కేర్స్‌కు రూ. 124 కోట్లు

Update: 2020-07-13 17:44 GMT

కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎం కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా.. 124 కోట్లు అందాయి. ఈ మేరకు గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. అయితే, ఈ మొత్తం డబ్బు.. 20 లక్షల లావాదేవీలు జరగడం ద్వారా పీఎం కేర్స్ లో చేరిందని అన్నారు. గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో సంజయ్ గుప్తా తెలిపారు. కరోనాపై పోరాటానికి కేంద్రం విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ ద్వారా విరాళాలు అందించవచ్చని కేంద్రం అప్పట్లో తెలిపింది.

ఈ ఈవెంట్‌లో ప్రసంగించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. భారత్‌లో డిజిటలీకరణ కోసం గూగుల్ చేపట్టిన చర్యలను గురించి ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌కు చెందిన వివిధ రంగాలలో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని పిచాయ్ ఈ సందర్భంగా తెలిపారు.

Similar News