అంత్య‌క్రియ‌లకు హాజ‌రైన 20 మందికి క‌రోనా

Update: 2020-07-13 17:18 GMT

కరోనా అంటువ్యాధి అన్న విషయం అందరికీ తెలుసు.. గుంపులుగా ఉంటే ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ అయినా కొంతమంది జనం అవగాహనా లేమితో సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు. బీహార్ లో అంత్యక్రియలకు హాజరైన 20 మంది ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన బీహతా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. జూలై 10 న ఆసుపత్రిలో మరణించిన వ్యాపారవేత్త రాజ్ కుమార్ గుప్తా అంత్యక్రియలకు హాజరు కావడానికి పాజిటివ్ సోకిన పాపుల్ అనే వ్యక్తి వెళ్ళాడు. అంతేకాదు దీనికి ముందు, మరణించిన రాజ్ కుమార్ గుప్తా మేనల్లుడికి దహనం రోజునే పాజిటివ్ అని తేలింది, తరువాత మరో కుటుంబ సభ్యుడు కూడా కరోనా బారిన పడ్డారు. దీని గురించి స్థానిక అధికారులకు సమాచారం రాగానే, అంత్యక్రియలకు హాజరైన 37 మంది వ్యక్తుల నమూనాను సేకరించారు, ఇందులో 20 మందికి పాజిటివ్ అని తేలింది. బీహతా ప్రాంతాన్ని ఇప్పుడు కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాగా బీహార్ లో మొత్తం కేసుల సంఖ్య 16,642 గా నమోదైంది. ఇందులో 5001 క్రియాశీల కేసులు, 143 మరణాలు ఉన్నాయి.

Similar News