రాజస్థాన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచిన్ పైలట్ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ప్రస్తుతం రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కార్యాయలం హెడ్ క్వార్టర్స్ జులై 13 వరకు, గ్రామీణాభివృద్ధి శాఖ హెడ్ క్వార్టర్స్ జులై 14 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ నేపథ్యంలో మిగిలిన వారికి వ్యాప్తి కాకుండా కార్యాలయాన్ని మూసివేసినట్టు స్పష్టం చేశారు. కోవిడ్ భారిన పడిన ఇద్దరు సిబ్బందితో సంప్రదింపులు జరిపిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కార్యాలయంలో శానిటైజేషన్ పనులు పూర్తయ్యాయి. కాగా రాజస్థాన్ లో ప్రస్తుతం రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గెహ్లాట్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు.