షూటింగ్స్ కి కరోనా భయం.. ఓ కొత్త ఆలోచనతో ముందడుగు

Update: 2020-07-13 13:24 GMT

కరోనాకి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది. వారానికో సినిమా రిలీజ్.. ఆడియో ఫంక్షన్లో, ప్రీమియర్ షోలో ఏదో ఒకటి తారాలోకం తరలివస్తే అభిమానులు పులకించి పోయేవారు. నాలుగు నెలలుగా సినిమా ముచ్చటే లేదు. షూటింగ్స్ మొదలు పెట్టుకోవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అని అన్నా కరోనా కాలు ముందుకు పడనివ్వట్లేదు. ఇండస్ట్రీలో ఎవరో ఒకరు కరోనా బారిన పడడంతో కలవరానికి గురవతున్నారు చిత్ర యూనిట్ తో పాటు నటీ నటులు. అక్కడక్కడా షూటింగ్స్ మొదలైనా పూర్తిస్థాయిలో కోలాహలం మొదలవలేదు. ఈ నేపథ్యంలో కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనే విభాగాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ విభాగం పని.. అవుట్ డోర్ లో కాని, ఇండోర్ లో కాని చిత్రీకరణ మొదలు పెట్టినప్పుడు యూనిట్ సభ్యులు కొవిడ్ బారిన పడకుండా రక్షణ చర్యలు చేపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ యూనిట్ చర్యలు తీసుకుంటుంది. త్వరలో ప్రభాస్ సినిమా 'రాధేశ్యామ్' యూనిట్ ఈ పద్ధతిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటుంది. కెమెరాలు, కాస్ట్యూమ్స్ అన్నింటినీ ప్రత్యేకమైన పద్ధతిలో శుభ్రపరుస్తారు.

Similar News