ప్రపంచంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి: ఐక్యరాజ్య సమితి

Update: 2020-07-14 15:30 GMT

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు సంఖ్య పెరగనుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ అన్నారు. 'ఆహార భద్రత, పోషణ పరిస్థితి- 2020' నివేదికను ఆయన విడుదల చేశారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల మంది పస్తులున్నారని ఆయన తెలిపారు. ఆ సంఖ్య 2018తో పోల్చుకుంటే ఒక కోటి ఎక్కువ అని.. గత ఐదేళ్లలో 6కోట్లు ఎక్కువ అని అన్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన కారణంగా చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2030నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని చూడాలన్న లక్ష్యం నెరవేరదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే, పరివర్తన ఏర్పడాలని.. కరోనాపై పోరాటానికి నిధులు కేటాయించాలని అన్నారు. ప్రపంచం కలిసికట్టుగా.. ఆకలి కేకలను దూరం చేయాలని గుటెరస్ పిలుపునిచ్చారు.

Similar News