బ్రెజిల్ అధ్యక్షుడికి రెండోసారి కరోనా పాజిటివ్

Update: 2020-07-16 17:03 GMT

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు గతంలో రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా, మూడో పరీక్షలో పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజుల కిందట ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇంట్లోనే నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు లక్షణాలు తగ్గడంతో మరోసారి కోవిడ్ పరీక్షలు చేశారు.. అయితే రెండోసారి కూడా ఆయన నివేదిక పాజిటివ్ అని తేలింది. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఇంటి నిర్బంధంలో ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఆరవ దేశం బ్రెజిల్, ఇది కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న కేంద్రాలలో ఒకటి. ఇక్కడ COVID-19 తో 75,000 మందికి పైగా బ్రెజిలియన్లు మరణించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దాదాపు 2 మిలియన్ల మంది వ్యాధి బారిన పడ్డారు.

Similar News