దంతాల దవాఖానకు కరోనా ఫీవర్.. రోగులు లేక..

Update: 2020-07-16 17:02 GMT

పళ్లు క్లీనింగ్ చేయించుకోడానికో, క్లిప్పులు వేయించుకోడానికో దంత వైద్యుని దగ్గరకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని దంత వైద్యులు చెబుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 50 రోజుల పాటు డెంటల్ క్లినిక్ లను మూసివేశారు. ప్రమాదానికి గురై దంతాలు విరిగిన వారు మినహా మిగిలిన వారు ఆస్పత్రి వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ నిబంధన కూడా తోడైంది వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి ముందుగా యాంటీజెన్ టెస్టులు చేయాలనే నిబంధన విధించింది. దీంతో డెంటల్ క్లినిక్ లకు వెళ్లే రోగుల సంఖ్య మరింత తగ్గిపోయింది.

అత్యవసరమైతే తప్ప ఆస్సత్రికి వచ్చే వారు కనిపించడం లేదు. వైద్యులు కూడా అత్యవసర కేసులనే చూస్తున్నారు. నిజానికి కరోనా భయం దంత వైద్యునికి మరింత ఎక్కువ వుంటుంది. వైరస్ నోటి లోని తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. దీంతో క్లీన్ చేసేటప్పుడు కానీ, చికిత్స సమయంలో కానీ ప్రతి రోగి నోటిని తప్పనిసరిగా పరిశీలించాలి. వచ్చే ఒకరు ఇద్దరు రోగుల కోసం పిపిఈ కిట్లు దరించి చూడాల్సి వస్తుంది. వారిచ్చే ఫీజు కిట్ల ఖరీదుకి కూడా సరిపోవడం లేదని వైద్యులు వాపోతున్నారు. గతంలో మాదిరి రెగ్యులర్ చెకప్ లు, రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ కోసం రోగులు దంతవైద్యులను సంప్రదించడం లేదు.

Similar News