ప్రారంభించిన నెలరోజుల్లోనే వంతెన..

Update: 2020-07-16 15:10 GMT

ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాంట్రాక్టర్లు. వంతెన నిర్మాణంలో లోపాల కారణంగా ప్రారంభించిన నెల రోజుల్లోనే వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది. గండక్ నదిపై సత్తర్ ఘాట్ వద్ద వంతెన నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ వంతెనను గత నెల 16వ తేదీన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. పలు జిల్లాలను కలిపే ఈ వంతెన వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సివాన్, శరణ్ జిల్లాల్లోని తూర్పు చంపారన్ నుంచి గోపాల్ గంజ్ ల మధ్య దూరం తగ్గించేందుకు గండక్ నదిపై వంతెనను రూ.263.48 కోట్లతో నిర్మించారు. నిర్మాణంలో నాణ్యత లోపాల కారణంగానే వంతెన ప్రారంభించిన నెలరోజులకే కొట్టుకుపోయిందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీయాదవ్ ఆరోపించారు. నాసిరకంగా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాల వల్లనే బ్రిడ్జి కూలిందని ఆయన ఆరోపించారు.

Similar News