రానురాను ప్రేమ అనే ముసుగులో వావి వరసలు మరుస్తున్నారు. 35 ఏళ్ల మహిళ ఇరవైఏళ్ళ కొడుకుతో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యాకు చెందిన 35 ఏళ్ల మెరీనా బల్మషేవ ఇన్‌స్టాగ్రామ్ స్టార్.. ఆమెకు అందులో నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు పదేళ్ల కిందట అలెక్స్ ఆరే అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు లేకపోవడం వలన అనాధశరణాలయంలో ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు,
అయితే గత రెండేళ్ల కిందట దంపతులిద్దరికీ మనస్పర్థలు రావడం వలన విడిపోయారు. విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత కోర్టు కన్నతండ్రికే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె పెంపుడు కొడుకైన ఇరవయ్యేళ్ల వ్లాదిమిర్ వోయాతో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు ఒక్కటవ్వడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సంవత్సరం మొదట్లో వివాహం చేసుకోవాలని అనుకున్నా కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి వాయిదా పడింది. అయితే గతవారం ఈ ఇద్దరు రిజిస్ట్రర్ ఆఫీసులో ఒక్కటయ్యారు. ఈ వీడియోను మెరీనా బల్మషేవ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.