సుప్రీం తలుపులు తట్టనున్న సచిన్ పైలట్

Update: 2020-07-16 15:21 GMT

రాజస్థాన్ లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ లోకి వచ్చేయాలంటూనే.. సచిన్ పైలట్ పై నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గినట్టు కనిపించడంలేదు. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం, మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్ కు కాంగ్రెస్ జారీ చేసిన విప్ ను ధిక్కరించారని.. మీటింగ్ కు హాజరుకాలేదని కాంగ్రెస్.. సచిన్ తో సహా.. 19 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన న్యాయపోరాటం చేయాల్సి నిర్ణయించారు. న్యాయవ్యాదులతో చర్చలు జరిపి.. సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు చట్టబద్దత లేదని.. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మాత్రమే స్పీకరు జారీ చేశారని సచిన్ పైలట్ అంటున్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఈ 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే 19 మందికి స్పీకర్ నోటీసులిచ్చారు

Similar News