తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో 13 నెలల కాలంలో దాడులు పెరిగిపోయాయని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి ఉపాధి హామీ పథకం బిల్లుల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేనితో పాటు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.