జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోం..

Update: 2020-07-16 19:05 GMT

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇంటి నుంచే పని కొనసాగించాలని ఉద్యోగులకు వివరించింది. ఈ అవకాశాన్ని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు అక్టోబర్ 2 వరకు ఇంటి వద్దనుంచే విధులు నిర్వహించమని చెప్పింది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇంటి నుంచి పనిచేసే గడువును పొడిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నిటికీ ఈ నూతన విధానం వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

Similar News