మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు దిక్కార పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్ కు ఎన్నికల కమిషర్ ను నియమించే అధికారం ఉందని.. అయినా.. ప్రభుత్వం సుప్రీం కోర్టు మూడు సార్లు ఆశ్రయించిందని.. అయినప్పటకీ ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదని నిమ్మగడ్డ తరుపు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రమేష్ కుమార్.. గవర్నర్ ను కలిసి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరాలని ఆదేశించింది. తరువాత వచ్చే శుక్రవారం నాటికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.