రాముడు నేపాల్‌లో పుట్టాడని ఆదేశ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలుకు భారత్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా.. ఓలీ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత సాంస్కృతిక వారసత్వం ఏంటన్నది ప్రపంచానికి తెలుసని.. ఓలీ మాటలను ప్రపంచం అంగీకరించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. ఓలీ వ్యాఖ్యలను ఆ దేశ విదేశాంగశాఖ ఓ క్లారటీ ఇచ్చిందని.. దీనిపై అంతకంటే ఎక్కువ మాట్లాడలేనని ఆయన అన్నారు. రాముడు జన్మ స్థలం భారత్ లో లేదని.. నేపాల్ లో పుట్టాడని నేపాల్ ప్రధాని ఓలీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. పురాణాల ప్రకారం సరయు నది ఒడ్డున ఉన్న అయోద్యలో రాముడు పుట్టడాని శివసేన స్పందించింది. కానీ, సరయు పేరుతో అసలు నేపాల్ లో నది లేదని తెలిపింది.