రాజ్యసభ కొత్త ఎంపీల ప్రమాణం ఆరోజే..

Update: 2020-07-17 17:18 GMT

రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజే వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తారని తెలుస్తోంది. రాజ్యసభ, లోక్ సభ రెండింటికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సమావేశాలను తిరిగి ప్రారంభించడం, అలాగే కొత్త సభ్యుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నిర్ణయించారు. మొదటిసారి. కోవిడ్ కారణంగా సామాజిక దూరంగా పాటించాలనే నిబంధనలకు అనుగుణంగా హౌస్ ఛాంబర్‌లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటీవల 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Similar News