అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించడానికి రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సమావేశం కానుంది. శంకుస్థాపన తేదీని ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. సమావేశానికి ట్రస్టు చైర్‌పర్సన్, ప్రధాని మోదీ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేన్ మిశ్రా కూడా హాజరు కానున్నారు. మోదీ ఖరారు చేసిన తేదీపై ఆలయ నిర్మాణ ప్రారంభం కోసం చర్చించనున్నారు. ఆగస్టులో నిర్మాణం ప్రారంభం జరగనుంది. ఇప్పటికే ట్రస్టు అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్ ఇప్పటికే ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా హాజరు కానున్నారు.