ఇండియన్ రైల్వేపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చైనా కంపెనీ

Update: 2020-07-18 18:26 GMT

చైనాకు చెందిన ఇంజినీరింగ్ కంపెనీ.. భారతీయ రైల్వేపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారత రైల్వేకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తమ బ్యాంకు గ్యారంటీని సొమ్ముచేసుకోకుండా అడ్డుకోవాలంటూ చైనా కంపెనీ అభ్యర్ధించింది. 2016లో చైనా కంపెనీతో ఒప్పందం జరిగినా.. నాలుగేళ్లలో 20శాతం పనులు మాత్రమే చేశారని.. పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతుందని.. భారతీయ రైల్వే కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాన్పూర్ దీనదయాళ్ సెక్షన్‌కు సంబంధించి 417 కిలోమీటర్ల మేర సిగ్నల్స్ వ్యవస్థ పూర్తికై 2016లో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, భారత్, చైనా సైనికులు మధ్య జరిగిన ఘర్షణతో చైనా కంపెనీలను భారత్ దూరం పెడుతున్న సంగతి తెలసిందే.

Similar News