దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ర్టవ్యాప్తంగా కేసుల సంఖ్య 1421కు చేరింది. ఇందులో 381 మంది మాత్రమే కరోనాతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి బారి నుండి 1014 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలియజేశారు.