గుండెపోటుతో 'రణబీర్ కపూర్ జిరాక్స్' మృ‌తి

Update: 2020-07-17 22:29 GMT

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ జిరాక్స్ గా పేరొందిన జునైద్ షా గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కాశ్మీర్ లోయకు చెందిన జునైద్ షా 2014 లో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయాడు, రణబీర్‌ను పోలి ఉండటమే ఇందుకు కారణం.. ఆ తరువాత ఈ స్టార్ డం ముంబైలో బ్యాగ్ మోడలింగ్ కు ఉపయోగపడింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన 28 ఏళ్ల లోపే మరణించారు.

జునైద్ షా మరణ వార్తను ఆయన బంధువులు, స్నేహితులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. శ్రీనగర్‌లోని తన ఎలాహి బాగ్ నివాసంలో జునైద్ షా మరణించినట్లు వారు వెల్లడించారు. కాగా 2014 ర‌ణ్‌బీర్ తండ్రి రిషి క‌పూర్‌ సైతం కొడుకును పోలిన వ్య‌క్తిని చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

Similar News