పోలీసులు తమ సమస్యలను పరిష్కరిస్తానని స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిన తల్లీకూతుళ్లు సీఎం కార్యలయం మందే ఒట్టికి నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వారిద్దరికీ తీవ్రగాయలు అయ్యాయి. అక్కడ ఉన్న పోలీసులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఓ భూవివాదానికి సంబంధించి పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని.. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, దీనిపై విచారణ చేస్తున్న అధికారులు.. అమేథీలో ఓ భూవివాదంలో వారు ఫిర్యాదు చేశారని అంటున్నారు. అయితే, సీఎం కార్యాలయంలో వారు ఎవరీనీ కలవలేదని.. కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఓ అధికారి చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామని అన్నారు.