లైవ్ లో న్యూస్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా యాంకర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి వుంటుంది. చదివే వార్తలను పూర్తి చేయాల్సి వుంటుంది. తాజాగా ఉక్రెయిన్ లో వార్తలు చదువుతున్న మహిళా న్యూస్ రీడర్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. న్యూస్ రీడర్ మారిచ్కా పడల్కో లైవ్ లో వార్తలు చదువుతోంది. ఈ క్రమంలో నోటి నుంచి ఒక పన్ను ఊడింది. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా చాలా సింపుల్ గా ఆమె చేత్తో ఆ పంటిని తీసి వార్తలు చదవడం కొనసాగించింది.
పన్ను ఊడిన విషయం స్పష్టంగా తెలుస్తున్నా ఏమీ ఫీలవ్వకుండా వార్తలు చదవడం పూర్తి చేసింది. కాగా తన 20 ఏళ్ల కెరీర్ అనుభవంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదని మీడియా ముందు వెల్లడించింది. ఇక వీడియోను సదరు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 30 వేల లైకులు రాగా, న్యూస్ రీడర్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.