ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇక అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు 50 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 70 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 70 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవడం రెండోసారి. అంతకుముందు రోజు కూడా రికార్డు స్థాయిలో ఒకేరోజు 75,600 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో 18 రాష్ట్రాల్లో రెడ్ జోన్‌లుగా ప్రకటించారు.