కరోనా ముందు ప్రపంచం ఓడిపోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ అన్నారు. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ మానవ సమాజం మొత్తం కరోనా ధాటికి చితకలపడిపోయింది. మన బలహీనత ఏంటో కరోనా మహూమ్మారి చూపించిందని అన్నారు. ప్రపంచ ఆరోగ్యసమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ మహమ్మారికి చికిత్స ఏంటో? దీన్ని ఎలా అంతమొందించాలో అర్థం కావటంలేదని అన్నారు.