రామాలయ నిర్మాణానికి రఘురామకృష్ణంరాజు విరాళం

Update: 2020-07-20 17:31 GMT

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్టు 5న రామాలయ నిర్మాణ శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మోదీ అకౌంట్ కు తన మూడు నెలల జీతాన్ని జమచేశారు. రామాలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా సాయం చేస్తున్నానని మోదీకి రాసిన లేఖలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు రామాలయ భూమి పూజకోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాగా.. ఆగస్టు 5న జరగనున్న రామాలయ శంకుస్థాపనకు ప్రధానిమోదీ హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారు.

Similar News