ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు తాగితే..

Update: 2020-07-19 20:54 GMT

జలుబు చేసినప్పుడో, గొంతు నొప్పిగా అనిపించినప్పుడో వేడి నీరు తాగుతుంటారు చాలా మంది. అలా కాకుండా ప్రతి రోజూ దినచర్యలో భాగంగా ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్లి పోతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ముక్కు, గొంతులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా గోరు వెచ్చని తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీరు తాగితే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

Similar News