రాజస్థాన్ లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ప్రారంభం అయింది. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. రాజధాని నగరం జైపూర్ శివార్లలోని లగ్జరీ హోటల్ అయిన ఫెయిర్మాంట్ లో సీఎల్పీ భేటీ అయింది. ఇక్కడ గెహ్లాట్ కు మద్దతు ఇచ్చే శాసనసభ్యులు గత వారం నుండి బస చేస్తున్నారు. ఈ సమావేశానికి 85 కు పైగా ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి కావలసిన సంఖ్యా బలం తమకుందని సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. కాగా జూలై 13, జూలై 14 న జరిగిన రెండు సిఎల్‌పి సమావేశాలకు హాజరుకాకుండా విప్‌ను ధిక్కరించారని కాంగ్రెస్ పార్టీ.. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సిపి జోషికి ఫిర్యాదు చేయడంతో పైలట్, ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు అందించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.