ఓవైపు కరోనా నుంచి ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఆందోళనకు గురిచేస్తుందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎంత శాతం పెంచారు అనేది.. శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరుసగా 20 రోజులపాటు పెట్రోల్, డీజిల్ చార్జీలను పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వాకికే దక్కుతుందని అన్నారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల కాలంలో 2 దఫాలుగా పెట్రో ధరలపై పెంచిన వ్యాట్‌ను తగ్గించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.