పాకిస్తాన్ టిక్‌టాక్ మాతృసంస్థకు గట్టివార్నింగ్ ఇచ్చింది. జూలై1న పబ్‌జీ గేమ్‌ను కూడా నిషధించిన పాక్ తాజా టిక్‌టాక్‌పై పలు ఆరోపణలు చేస్తుంది.పబ్‌జీ గేమ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందని.. దీంతో పాటు.. పిల్లలను, యువతను తప్పుదారి పట్టించేలా ఉందనే కారణంతో బ్యాన్ చేసిస విషయం తెలిసిందే. అయితే, టిక్‌టాక్‌పై ఇవే ఆరోపణలు చేస్తుంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా యాప్స్‌లో అసభ్య కంటెంట్ ఉంటోందంటూ అనేక ఫిర్యాదులు తమవద్దకు వచ్చాయని వీటిలో అధికంగా టిక్‌టాక్, బిగో నుంచే ఉన్నాయని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బిగోకు నోటీసులు జారీ చేశాం.. కానీ, వారి స్పందన అంత సంతృప్తికరంగా లేదు. దీంతో ఇప్పటికే బిగోను నిషేధించామని తెలిపింది. ఇప్పుడు టిక్‌టాక్‌కు ఆఖరి హెచ్చరిక జారీ చేశాం.. ఆసంస్థ తీరు మార్చుకోకపోతే.. నిషేధం తప్పదని పాక్ ప్రభుత్వం హెచ్చరించింది