నన్ను మెడిటేషన్ చాలా మార్చింది. నేనెవరో తెలుసుకునేందుకు ఉపయోగపడింది అని అంటున్నారు నటి మంచు లక్ష్మి, తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పటినుంచి నాకు రకరకాల ఆలోచనలు వచ్చేవి.. నేనెవర్ని.. ఎందుకు పుట్టాను.. ఏమిటి ఈ జీవితం.. ఇలా చాలా ప్రశ్నలు నన్ను వేధించేవి. తరగతి గదిలో చదువుకున్న క్వాంటమ్ ఫిజిక్స్ కి తోడు స్వీయ నియంత్రణ కోర్సు చేశాను. 18 ఏండ్ల వయస్సులో మెడిటేషన్ కోర్సు చేశా. మీకు కావలసినవన్నీ మీలోనే దాగి ఉన్నాయని మెడిటేషన్ చెబుతుంది. జీవితం అనేది ఈ దేహంలో ఉండిపోదని, మనలోని ఆత్మ నిరంతరం ప్రయాణం చేస్తుందని మెడిటేషన్ ద్వారా తెలిసింది. మెడిటేషన్ ద్వారా కోపం, నిరాశ నిస్పృహలను అంగీకరించడానికి తోడ్పడుతుంది అని అన్నారు. మెడిటేషన్ ద్వారా స్వాంతన చేకూరుతుందని మంచు లక్ష్మి వివరించారు.