8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని చంపేయమంటూ తల్లి సరళా దేవి ప్రభుత్వాన్ని కోరింది. ఎట్టకేలకు పోలీసుల చేతిలోనే అతడు హతమయ్యాడు. ఇప్పుడు తమ్ముడు దీప్ ప్రకాశ్ దూబే.. పోలీసులు అన్నను హతమార్చినట్లే తనని కూడా చంపేస్తారేమోనని భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే తల్లి సరళాదేవి చిన్న కొడుకు దీప్ ప్రకాశ్ ను పోలీసులకు లొంగిపోవాలని లేదంటే ఎక్కడున్నా వెతికి పట్టుకుని నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తారని హెచ్చరిస్తున్నారు. నువ్వు ఏ తప్పూ చేయలేదు.. కేవలం నీకు అన్నతో ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు.. పోలీసులు నీకు రక్షణ కల్పిస్తారు అని కోరారు. కాగా, వికాస్ దూబేకి చిన్న నాటి నుంచి ఉన్న నేరప్రవృత్తి కారణంగా కుటుంబసభ్యులు అతడిని దూరం పెట్టారు. తల్లి సరళాదేవి చిన్న కొడుకుతోనే కలిసి ఉంటోంది.