అలస్కాన్ ద్వీపకల్పంలోని ఆగ్నేయ తీరంలో మంగళవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. ఆంకరేజ్‌కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో ఉన్న ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరిక జారీ అయింది.. ఈ మేరకు యుఎస్ నేషనల్ సునామి తెలిపింది.
దీంతో సోషల్ మీడియాలో సైరన్ల వీడియోలు పోస్ట్ చేస్తూ.. చాలా మంది నివాసితులు తమ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దక్షిణ అలస్కా మరియు అలస్కా ద్వీపకల్పం, కెనడా ఎంట్రన్స్, అలస్కాలోని యునిమాక్ పాస్, పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరిక అమల్లో ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.