బ్రెజిల్ అధ్యక్షుడికి మూడోసారి కరోనా పాజిటివ్‌

Update: 2020-07-23 15:51 GMT

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు వరుసగా మూడోసారి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం బోల్సోనారో ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఆయనను జూలై 21 న మూడోసారి పరీక్ష నిర్వహించినట్టు అధ్యక్షుడి సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు జూలై 14 న జరిగిన పరీక్షలో కూడా పాజిటివ్ వచ్చింది. కాగా బోల్సోనారో జూలై 7 న కరోనా యొక్క తేలికపాటి లక్షణాలు రావడంతో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.

ఆరోజే ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది. దీంహో హోమ్ క్వారంటైన్ లో ఉంటూ.. యాంటీ మ‌లేరియా ఔష‌ధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నానని, ఇది తనకు సహాయపడిందని ట్వీట్ చేశారు. కాగా బ్రెజిల్ లో 2 మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 81వేల మందికి పైగా మరణించారు. కరోనా మహమ్మారికి భారీగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తరువాత బ్రెజిల్‌ రెండవ స్థానంలో నిలిచింది.

Similar News