84మంది రాజ్‌భవన్‌ ఉద్యోగులకు కరోనా

Update: 2020-07-23 18:28 GMT

తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపుతుంది. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో పని చేస్తున్న 84 మందికి మహమ్మారి సోకింది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో కరోనా బారిన పడటానికి ముగ్గురు వ్యక్తులే కారణమని రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటించింది. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాజ్‌భవన్ ప్రధాన భవనంలో పని చేయరని, వారు మెయిన్ గేట్ ప్రాంతంలో పని చేసేవారని అధికారులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై దర్యాప్తు జరిగిందని.. వారు ఆరోగ్య శాఖ నిర్బంధంలో ఉన్నారని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. వారు ప్రధాన భవనంలోకి వీరు ఎప్పుడూ రాలేదని.. గవర్నర్‌ను గానీ రాజ్‌భవన్ సీనియర్ అధికారులను కలవలేదని రాజ్‌భవన్ నుంచి విడుదలైన ఓ ప్రకటన పేర్కొంది. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్‌భవన్ బంగ్లా, పరిసర ప్రాంతాలు శుభ్రపరుస్తున్నారు.

Similar News