3 నిమిషాల వ్యవధిలో 100 యోగాసనాలు..

Update: 2020-07-22 21:52 GMT

దుబాయ్‌కు చెందిన భారతీయ బాలిక నిమిషాల వ్యవధిలో 100 యోగా ఆసనాలు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల సమృద్ధి కలియా ప్రదర్శించిన వంద యోగా భంగిమలతో గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. కలియా మాట్లాడుతూ కృషి, పట్టుదల తన విజయానికి కారణమని చెబుతుంది. మన కలల్నిసాకారం చేసుకునేందుకు నిశ్శబ్దంగా కష్టపడండి. విజయం మీ సొంతమవుతుంది అని కలియా తల్లిదండ్రులు తమ ఇష్టంగా కష్టపడి సాధించిన ఘనతను వివరిస్తున్నారు. ఇది నా శారీరక సామర్థ్యం కాదని, నా మానసిక సామర్థ్యం అని నేను భావిస్తున్నాను కలియా చెబుతుంది.

7వ తరగతి చదువుతున్న కలియా 100 యోగా ఆసనాలు చేసి తన మొదటి రికార్డును తానే బద్దలు కొట్టింది. రెండవ ప్రపంచ రికార్డును సాధించింది - ఒక నిమిషంలో 40 అధునాతన యోగా భంగిమలను ప్రదర్శించి మొదటి రికార్డును సొంతం చేసుకుంది. జూలై 15న బుర్జ్ ఖలీఫా కట్టడంలోని వ్యూయింగ్ డెక్ మీద సమృద్ధి పరిశీలకుల సమక్షంలో యోగా విన్యాసాలు ప్రదర్శించింది. ఒక చిన్న చెక్క బాక్స్ లో నుంచి నేల మీద కాలు పెట్టకుండా మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్లలో వంద యోగాసనాలు వేసి అరుదైన రికార్డును సాధించింది. ఇంత చిన్న వయసులో ఇన్ని ఆసనాలు వేసిన బాలిక ప్రపంచంలో మరొకరు లేరు.

తండ్రి సిద్ధార్ద్ కాలియా, తల్లి ప్రేణ కాలియా. అమ్మమ్మ భారతదేశంలో యోగ సాధకురాలు. ఆరేళ్ల వయసునుంచే యోగ పట్ల ఆసక్తి కనబరిచింది సమృద్ధి కలియా.. అమ్మమ్మే తనకు స్ఫూర్తి అని చెబుతుంది సమృద్ధి. త్వరలో ప్రపంచ దేశాలలో తన యోగా విన్యాసాలను ప్రదర్శించనుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు తండ్రి సిద్ధార్థ్ కలియా. దుబాయ్ లో స్థిరపడిన అమ్మాయి యోగాలో రాణించి తన ప్రతిభను నలుచెరగుల విస్తరింపజేసేందుకు ప్రయత్నించడం అభినందనీయం.

Similar News