ఆఫ్ఘనిస్థాన్‌లో 24 మంది తాలిబన్‌లు హతమయ్యారు. జబుల్ ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు, తాలిబన్‌లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అర్ఘన్‌దాబ్, షింక్జాయ్, షా జోయ్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎదురు కాల్పుల్లో మొత్తం 24 మంది తాలిబన్‌లు హతమయ్యారు. మరో కొంత మంది తాలిబన్లు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ ప్రకటనపై తాలిబన్‌లు ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.