ప్రముఖ డ్యాన్సర్ అమల శంకర్ కన్నుమూత

Update: 2020-07-24 16:19 GMT

ప్రఖ్యాత డ్యాన్సర్ గా పేరొందిన అమల శంకర్ మరణించారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అమల శంకర్ శుక్రవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణాన్ని మనవరాలు దృవీకరించారు. ఈ మేరకు అమల శంకర్ మనవరాలు శ్రీనంద శంకర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రశంసలు పొందిన ప్రముఖ డ్యాన్సర్ అమల శంకర్ ఇకలేరని.. నాలుగు చిరస్మరణీయ చిత్రాలను పంచుకున్నారు.. అందులో ఒక ఎమోషనల్ క్యాప్షన్ రాశారు. 'ఈ రోజు నానమ్మ 101 ఏళ్ళ వయసులో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది. మేము గత నెలలో ఆమె పుట్టినరోజును జరుపుకున్నాము.' అని పేర్కొన్నారు.

Similar News