కరోనా మహమ్మారి ప్రభావం దేశంలో ఉద్యోగులపై తీవ్రంగా పడింది. ప్రస్తుతం దేశంలో ప్రతీ ఐదుగురులో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ఐఏఎన్‌ఎస్- కొవిడ్ సీఓటర్ 1,723మందిని సర్వే చేయగా 21.57 శాతం మంది ప్రజలు పూర్తిగా నిరుద్యోగులుగా మారారట. మరోవైపు కొన్ని నిబంధనలు, భద్రతా చర్యల కింద 25.92 శాతం మంది ఇప్పటికీ అదే జీతంతో పనిచేయాగా.. 7.09 శాతం మంది జీతం తగ్గించుకొని వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. భారత్‌లో లాక్‌డౌన్ మార్చి 25 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 1 నుంచి అన్‌లాక్ మొదలైంది. ఈనేపథ్యంలో చేసిన సర్వేలో లాక్‌డౌన్ సడలించిన తరువాత దేశంలో 6.12 శాతం మందికి ఆదాయం లేదని, 1.20 శాతం మంది తమ పనులను కొనసాగిస్తున్నప్పటికీ జీతం మాత్రం లభించడం లేదని సర్వే సూచించింది.