ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి జై ప్రతాప్ సింగ్ కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు లక్షణాలు లేకుండా వైరస్ బయటపడిందని వైద్యులు అన్నారు. దీంతో జై ప్రతాప్ సింగ్ లక్నోలోని తన ఇంటి వద్దే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయనను అప్పుడప్పుడు వచ్చి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 2,529 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దాంతో రాష్ట్రంలో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 21,003 గా ఉంది. లక్నోలో కొత్తగా 319 పాజిటివ్ కేసులు వచ్చాయి. లక్నోలో ప్రస్తుతం దాదాపు 3,200 క్రియాశీల కేసులు ఉన్నాయి.