రాజస్థాన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే మంత్రులందరికీ దీనిపై సమాచారం అందింది. గత 12 గంటల వ్యవధిలో మంత్రివర్గం రెండోసారి సమావేశం అవుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కలరాజ్ మిశ్రా ఒప్పుకోకపోవడంతో..
ప్రస్తుత పరిస్థితులలో వెంటనే అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా క్యాబినెట్ తీర్మానాన్ని గవర్నర్ కు పంపాలని సీఎం అశోక్ గెహ్లాట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాలని గెహ్లాట్ భావిస్తున్నారు. అయితే ఈ సమావేశం గెహ్లాట్ క్యాంప్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది.