బ్రెజిల్‌లో ఒక్కరోజే కరోనాతో 1211 మంది మృతి

Update: 2020-07-26 11:01 GMT

బ్రెజిల్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 51,147 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 23,94,513కు చేరింది. కరోనా బారి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 16 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. కరోనాతో ఒక్కరోజపే 1211 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 86,449కి చేరింది.

ఇక తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్సొనారోకు నెగెటివ్ వ‌చ్చింది. ఈనెల 7న క‌రోనా త‌న‌కు క‌రోనా సోకిందని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌కటించారు. అనంత‌రం రెండుసార్లు ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చింది.

Similar News