ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత ప్రజలకు అవసరాలకు అనుగుణంగా.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ యూఎస్‌కు చెందిన అస్ట్రాజెనెకాతో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ.. వ్యాక్సిన్ తయారు చేసిన సమయంలో ఆస్ట్రాజెనెకా సంస్థ కీలకపాత్ర పోషించింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణెలో ఉంది. ఆగస్టు చివరి నాటికి ఒక కోటి డోసులు తయారుచేయాలని ఆస్ట్రాజెనెకా సంస్థ... సీరం ఇన్‌స్టిట్యూట్‌ను కోరింది. కానీ, సీరం ఇన్‌స్టిట్యూట్ మాత్రం మూడు కోట్ల డొసులు తయారు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. అమెరికాలో అభివృద్ధి చేసిన ఈ టీకాను అక్కడి పౌరులపై మాత్రమే ప్రయోగించారు. కానీ, ఈ టీకా భారతదేశంలో నివసించేవారిపై ఎంత వరకూ పని చేస్తుందో తెలుసుకోవాల్సి ఉంది. దీని కోసం ఇక్కడ ప్రజలపై పరీక్షించాలి. దీనికోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాల్సివుంటుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేయనున్న ఈ టీకా.. పూణే, ముంబైలో ఉన్న వారిపై ప్రయోగిస్తారని తెలుస్తుంది. దేశంలో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ కరోనా ప్రభావం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.