రాజస్థాన్ లో హైడ్రామా.. పిటిషన్‌ను వెనక్కితీసుకున్న‌ అసెంబ్లీ స్పీకర్‌

Update: 2020-07-27 15:35 GMT

రాజస్థాన్ లో పూటకోవిధంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 మంది కాంగ్రెస్ శాసనసభ్యులపై అనర్హత నోటీసులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను రాజస్తాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌ను

ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్‌ సీపీ జోషీ కోరారు. కాగా 18 మంది సచిన్ వ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్‌ హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్‌ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా.. దీనిపై దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది.

Similar News