నిరుద్యోగులకు శుభవార్త.. అమెజాన్ లో 1,000 ఉద్యోగాలు..

Update: 2020-07-27 20:00 GMT

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు బంపరాఫర్ అందిస్తోంది. ఐర్లాండ్ లోని అమెజాన్ కార్యాలయంలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించనుంది. క్లౌడ్ సేవలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో నూతన అమెజాన్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా ఈ పోస్టులు బిగ్ డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్ మేనేజర్లు తదితర విభాగాలకు సంబంధించినవని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వెబ్ సర్వీస్ విభాగంలో కూడా ఉద్యోగులను నియమించనుంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ నియామకాలు చేపడుతున్నామని సంస్థ మేనేజర్ మైక్ బియరీ పేర్కొన్నారు.

Similar News