మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం

Update: 2020-07-29 16:51 GMT

మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ పేరును మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని స్థానంలో విద్యా మంత్రిత్వ శాఖగా పేరును ప్రతిపాదించింది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మంత్రిత్వశాఖ పేరును మార్చాలని సూచించింది. నూతన విద్యావిధానం డ్రాఫ్ట్ లో ఈ పేరు మార్పు అనే అంశం కీలకంగా ఉంది. దీంతో బుధవారం కేంద్ర మంత్రిమండలి దీనికి ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్‌ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది.

Similar News