పుదుచ్చేరిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు 100కు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం కొత్తగా 141 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో పుదుచ్చేరిలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 3,011కు చేరింది. మొత్తం కేసులలో 1782 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 1182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.